పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకునేందుకు తనదైన రీతిలో ప్రచారం చేపట్టారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు మామూలుగా హామీలు ఇవ్వడం, ప్రలోభాలకు గురిచేయడం కామన్.
Sam Pitroda: కాంగ్రెస్ సీనియర్ నేత, ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ తన పదవకి రాజీనామా చేశారు. ఆయన చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు భారతదేశం వ్యాప్తంగా వివాదాస్పదం కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 50 గడపలు ఉన్న ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా.. మంగళవారం దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామంలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం కాకర్ల సురేష్ గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ…
JP Nadda: కర్ణాటక బీజేపీ వివాదాస్పద పోస్టు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. ఓబీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్ల అనే అంశంపై బీజేపీ ఓ యానిమేటేడ్ వీడియోను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.
Navneet kaur: తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధించే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ సీట్లు సాధించిన కాషాయ పార్టీ, ఈ సారి తెలంగాణలో 17 సీట్లకు గానూ డబుల్ డిజిల్ సీట్లను సాధించాలనుకుంటోంది.
ప్రభుత్వ ఉద్యోగులు సైతం భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ (బుధవారం) ఉదయం ఆయన మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల పాకిస్థాన్ కు చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారసత్వ పన్ను (ఆస్తి విభజన) విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ప్రస్తుతం రాజకీయ గందరగోళం నెలకొంది. ప్రధాని మోడీ తన ఎన్నికల ర్యాలీలలో వారసత్వ పన్నును ప్రస్తావిస్తూ కాంగ్రెస్, రాహుల్ గాంధీని నిరంతరం టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశప్రజల ఆస్తిలో సగం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బీజేపీ ఆరోపిస్తోంది.
2019లో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాల్లో హోరెత్తుతోంది. ఇక మిగిలింది 4 రోజులే ఉండడంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలోని స్టార్ క్యాంపెయినర్లు అంతా ప్రచార రంగంలోకి దూకారు. పోటాపోటీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో దూసుకుపోతున్నారు.