పార్లమెంట్ ఎన్నికలు దేశ.. మన కుటుంబాల భవిష్యత్తుకి కీలకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థని ధ్వంసం చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. కీలకమైన చట్టాలు.. ప్రతిపక్షాలను తొక్కేసి ఆమోదం పొందేవి అని ఆయన వ్యాఖ్యానించారు. నియంతృత్వ ధోరణి ప్రజలకు తెలియాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. మోడీ స్పీచ్‌లు చూస్తే.. ఇంత దిగజారి పోయారు అనిపిస్తుందని, స్టేట్స్ మెన్ లాగా ఉండాలి కానీ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ…
Ponnam Prabhakar: బీజేపీ పొరపాటుగా గెలిస్తే మన రిజర్వేషన్లు , మనతో పాటు ఎస్సి ఎస్టీ ల రిజర్వేషన్లు తొలగించే కుట్ర జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రలోని శివసేన(యూబీటీ)పై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నకిలీ శివసేన నాయకులు తనను మట్టి కరిపిస్తామంటూ కలలు కంటున్నారన్నారు. ఈ నకిలీ శివసేన నాయకులు తనను సజీవ సమాధి చేయాలని మాట్లాడుతున్నారన్నారు.
MP Navneet Kaur: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్‌నగర్‌లో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నవనీత్ కౌర్‌పై పోలీసులు కేసు నమోదు అయ్యింది.
జేపీ ప్రచారం జోరు పెంచింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. పొరుగుదేశం పాకిస్థాన్ తో అణుబాంబులు ఉన్నందున భారత్ ఆ దేశాన్ని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మనం వారిని గౌరవించకపోతే భారత్‌పై అణుదాడి గురించి ఆలోచించవచ్చు. పాకిస్థాన్‌కు సంబంధించి అయ్యర్ చేసిన ప్రకటనపై వివాదం నెలకొంది.
ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ మ్యానిఫెస్టోను విడుదల చేస్తాయి. ప్రజలకు కావాల్సిన వసతులు సమకూర్చే విధంగా వారిని ఆకట్టుకునే విధంగా పథకాలు రూపొందిస్తారు.
మధ్యప్రదేశ్ లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఇటీవల జరిగిన మూడో దశ పోలింగ్ లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.
నాలుగో విడత ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ (శుక్రవారం) మరోసారి పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. ఈ రోజున అసన్సోల్, రాంపూర్హాట్, రానాఘాట్‌లలో మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఆర్థికవ్యవహారాల సలహా మండలి(ఈఏసీ–పీఎం) నివేదికలోని గణాంకాలపై తేజస్వీ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు.