ప్రపంచ మీడియా ఇప్పుడు ఇండియాపై ఫోకస్ పెట్టింది. నెక్ట్స్ వచ్చే గవర్నమెంట్ ఎవరిదంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అంతేకాకుండా రకరకాలైన కథనాలు కూడా ప్రచురిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది.
ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడనుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వినోద్ తావ్డే, మనోహర్ లాల్ ఖత్తార్, అశ్విని వైష్ణవ్, తరుణ్ చుగ్, శివ్ ప్రకాష్, మన్షుక్ మండవీయ, బీఎల్ సంతోష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు.
తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. టీడీపీ సంబరాలు తాత్కాలికం మాత్రమే.. అసలు సంబరాలు రేపు మేం చేస్తాం అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈసీ నిబంధనలు తప్పుబట్టిన ఆయన.. ఈసారి ప్రతిదీ నిబంధనలకు విరుద్ధంగానే ఈసీ చేస్తుంది.. ఈసీపై చంద్రబాబు కంట్రోల్ ఉందని తెలిసిపోతుంది.
Mamata Banerjee: లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నిన్న వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ మరోసారి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.
Pema Khandu: చైనా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఈ రోజు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 60 సీట్లకు గానూ ఏకంగా 46 సీట్లను కైవసం చేసుకుంది.
Assembly Elections: హిమాలయ రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. అరణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది.
శనివారం లోక్సభ ఎన్నికలకు సంబంధించి చివరి దశ ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అందులో అన్నీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుగుణంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వివిధ టీవీ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్లో సైతం బీజేపీ ఏకపక్షంగా విజయం సాధిస్తోందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో.. ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు.
PM Modi: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలని ట్వీట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ లో చివరిదశ ఎన్నికల్లో హింస చెలరేగింది. శనివారం నదియాలో బీజేపీ కార్యకర్త కాల్చి చంపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే బీజేపీలో చేరిన హఫీజుల్ షేక్ను టీ స్టాల్ వద్ద ఓ వ్యక్తి కాల్చి చంపాడు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించగా.. పరారీలో అతని కోసం వెతుకుతున్నారు. మృతుడు షేక్ పై దాడి చేసిన వారిలో ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిద్దరిపై క్రిమినల్ రికార్డులు ఉన్నాయని పోలీసులు…