Eknath Shinde: మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగి, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే, ఎన్నికలకు కొద్దిరోజులుగా శివసేన, బీజేపీ మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని ఉల్హాస్నగర్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచందానీ చేసిన ప్రకటనపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ నేతలు క్షమాపణలు చెబితే తప్ప ఇక్కడ బీజేపీ అభ్యర్థికి శివసేన పనిచేయదని పేర్కొంది. యువసేన కళ్యాణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కీ భుల్లార్ మాట్లాడుతూ.. రాంచందనీ…
రుణమాఫీ చేస్తానని, రైతుబంధు పెంచి ఇస్తానని వాగ్దానాలన్నీ చేసి, ఇవ్వాళ పెంచిన రైతు భరోసా కాదుకదా ఉన్న రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వమన్నారని పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలని చెబుతున్న నరేంద్ర మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డ్ లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి అతిషి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మురికినీళ్లతో నిండిన బాటిల్ను తీసుకొచ్చి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు ఇలాంటి నీళ్లేనా? సరఫరా చేసేదంటూ ఆమె నిలదీశారు.
67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సీపీసీ) కోసం ఎంపీ పురందేశ్వరి ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్, స్టీరింగ్ కమిటీకి ఛైర్పర్సన్ ఎంపీ పురంధేశ్వరి ఆస్ట్రేలియా దేశంలోని సిడ్ని నగరంలో 67వ సీపీసీలో పాల్గొననున్నారు.
సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించిన నిందితులను ఎవరి కూడా వదిలి పెట్టేది లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో, పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుండి 30వ తేదీ మధ్య బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయించింది. నవంబర్ 27న రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహణ కూడా ఏర్పాటు చేశారు. అలాగే, వచ్చే నెలలో జిల్లాస్థాయిలోనూ కార్యశాలలు ఏర్పాటు చేయాలని ఉద్దేశిస్తున్నారు.
రేవంత్, కేటీఆర్ మీరు ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు... మోకాళ్ల యాత్ర చేయండన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో మీడియాతో మాట్లాడుతూ.. 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే దమ్ముందా? గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఒప్పుకునే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు.
West Bengal: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది.