తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయపార్టీల మధ్య యుద్ధంగా మారుతోంది. పరస్పరం విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే సిద్ధమైంది బీజేపీ. ఇవాళ, రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10.30 కి నల్గొండ కి చేరుకోనున్నారు బండి సంజయ్. చర్లపల్లి బైపాస్ వద్ద ఘన స్వాగతం బీజేపీ శ్రేణులు స్వాగతం పలకనున్నాయి. అనంతరం ఆర్జాలబావి…