బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రాయ యాత్రకు హైకోర్టు నుంచి అనుమతి లభించింది. యాత్ర నిలిపివేయాలని పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని కొట్టివేసింది. దీంతో.. నేటి నుంచి యాత్రను తిరిగి ప్రారంభించేందుకు బీజేపీ నేతలు సమాయమత్తమవుతున్నారు. మూడు రోజులు జరిగిన జాప్యం కారణంగా, పాదయాత్రను కుదించాలని నిర్ణయించుకున్నారు. నేడు, రేపు కలుపుకొని మొత్తం 30 కి.మీ. పాదయాత్రతో ఈ యాత్రను ముగించాలని డిసైడ్ అయ్యారు. ఆగిన చోట నుండే పాదయాత్ర ప్రారంభమవుతుందని, రోజుకు…
ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ జరగనుందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడుతారన్నారు.
21న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని స్పష్టం చేశారు బండి సంజయ్. మునుగోడు సభకు అమిత్ షా హాజరు అవుతారని, ఆయన సమక్షంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని తెలిపారు.
కొన్ని రోజుల నుంచి తెలంగాణలో రాజకీయం అగ్గి రాజుకుంటోంది. తమ ఉనికి చాటేందుకు రాజకీయ పార్టీలు పాదయాత్రలు, సభలంటూ వరుసగా నిర్వహిస్తూ.. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ విమర్శలకి తెలంగాణ మంత్రులు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో పర్యటించిన కేటీఆర్.. మరోసారి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అసలు కేసీఆర్ లేకపోతే.. టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిదని ప్రశ్నించారు. విమర్శలు చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చాలా…