BJP Nirudyoga march: నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీజేపీ శ్రేణులు “నిరుద్యోగ యాత్ర” నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఈటల, విజయశాంతి, రఘునందన్ రావు, రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొంటారు.
హనుమకొండ జిల్లాలో ఉద్రిక్త వాతావణం నెలకొంది. కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వి నేతల నిరసన చేపట్టారు. బీఆర్ఎస్వీ నేతలు ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేశారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వరంగల్‌లో నిరుద్యోగ యాత్ర నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్లతో భారీ ర్యాలీ చేపట్టనున్నారు.