Payal Shankar: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అంటే ఏమనుకుంటున్నావ్ కేటీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం ఏం తప్పులు చేసిందో శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియాలో సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలపై స్పందించారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే సమయంలో ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. MIM కి గంటల తరబడి సమయం ఇచ్చారు… 8…