BJP leader Ranjith Srinivasan Murder Case: కేరళ సెషన్స్ కోర్టు మంగళవారం (జనవరి 30) సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో మావెలిక్కర అదనపు సెషన్స్ కోర్టు 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధించింది. నిందితులు అందరూ ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన వారు కావడం గమనార్హం. కేరళలో రెండేళ్ల క్రితం బీజేపీ నేత రంజిత్ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.…
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. బీజేపీ నేతను మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రతన్ దూబ బీజేపీ నారాయణపూర్ జిల్లా విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శనివారం రోజు జిల్లాలోని కౌశల్నార్ ప్రాంతంలో రతన్ దూబేను మావోయిస్టులు చంపేవారు. ఆయన జిల్లా పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Anurag Thakur: రామ నవమి వేడుకల్లో హౌరా, బెంగాల్ లోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ మత ఘర్షణలపై బీజేపీ, త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే దుర్గాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త, బిజెపి నాయకుడు రాజు ఝా, కొంతమంది సహచరులతో కలిసి కోల్‌కతాకు వెళుతుండగా, శక్తిగఢ్ ప్రాంతంలోని మిఠాయి దుకాణం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీఎం మమతా బెనర్జీపై…