జైలు నుండి విడుదలైన కమలాపూర్ బీజేపీ నాయకులకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘనస్వాగతం పలికారు అనంతరం వారిని సన్మానించారు. ఈనేపథ్యంలో.. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. 20ఏండ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉందని అన్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తాను ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు పూనుకున్నారు.. అయితే, అస్వస్థకు గురైన ఆయన.. ఆస్పత్రిలో చేరారు.. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగిస్తారా? రద్దు చేసుకుంటారా? వాయిదా వేస్తారా? అనే చర్చ మొదలైంది.. వీటికి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈటల రాజేందర్. 12 రోజులుగా 222 కిలోమీటర్లకు పైగా ప్రజా దీవెన పాదయాత్ర జరిగిందని.. ఈ యాత్రలో ప్రతిక్షణం నా…