దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, మనోహర్ లాల్ ఖత్తార్, అశ్విని వైష్ణవ్, తరుణ్ చుగ్, శివ్ ప్రకాష్, మన్షుక్ మండవీయ, బీఎల్ సంతోష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు.