BJP Corporators: రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తో జీహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్ల సమావేశమయ్యారు. జల మండలి, జీహెచ్ఎంసి అధికారులపై గవర్నర్ కు కార్పొరేటర్ల ఫిర్యాదు చేశారు.
Mayor Vijayalakshmi: బీజేపీ కార్పొరేటర్ల తీరుపై జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఫైర్ అయ్యారు. అధికారులకు సిగ్గు లేదని మాట్లాడతారా? అంటూ బీజేపీ కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ సాధారణ సమావేశం ప్రారంభం కాగానే సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొన విషయం తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ నుంచి 48 కార్పొరేటర్లు గెలిచారు. గతంతో పోల్చితే ఈ సంఖ్య ఎక్కువే. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా.. ఆనాడు టికెట్లు ఇచ్చింది పార్టీ. అప్పుడు కొత్తగా బీజేపీ కండువా కప్పుకొన్నవాళ్లూ GHMC ఎన్నికల్లో కార్పొరేటర్లు అయ్యారు. దీంతో హైదరాబాద్‌లో బీజేపీ బలపడటానికి అవకాశాలు ఉన్నాయని కమలనాథులు లెక్కలేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు కార్పొరేటర్లు చేస్తున్న పనులు అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారట నాయకులు. వాస్తవానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంటే…
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. ఒక పార్టీ బీ ఫాం తీసుకుని గెలిచి.. వెంటనే మరో పార్టీలో చేరడం మామూలే. హైదరాబాద్‌లో బీజేపీ తన బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీ కార్పోరేటర్లు పార్టీలు మారడం పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. తాజాగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచిన కార్పొరేటర్ నరేంద్రకుమార్ పార్టీ మారారు. బీజేపీ తరఫున గెలిచి నిన్న టీఆర్ఎస్ లో చేరారు కార్పొరేటర్ నరేంద్రకుమార్. బీజేపీలో గెలిచి పార్టీ…
హైదరాబాద్ నగరంలోని లిబర్టీ వద్ద జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫర్నీచర్, పూలకుండీలు ధ్వంసం చేసినందుకు 10 మంది కార్పొరేటర్లపై కేసులు నమోదయ్యాయి. కాగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలంటూ మంగళవారం మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ఛాంబర్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఎన్నికల కోడ్ ఉన్నందున…
భారీ వర్షాలు.. కాలనీల మునక హైదరాబాద్‌లోని కార్పొరేటర్లకు కష్టాలు తెచ్చి పెడతున్నాయా? అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉన్నా.. బీజేపీ కార్పొరేటర్లకు చిక్కులు తప్పడం లేదా? బాధితులను ఓదారుస్తున్నా.. లోపల మాత్రం ఆ పార్టీకి ఎక్కడో తేడా కొడుతోందా? అప్పట్లో గొంతెత్తిన బీజేపీ నేతలు.. ఇప్పుడు మౌనం..! గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలిటిక్స్ గమ్మత్తుగా మారిపోతున్నాయి. గతంలో నగరంలో ఏవైనా సమస్యలుంటే.. ప్రతిపక్షాలు గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీసేవి. సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ఆందోళనలు…
తెలంగాణలో బోనాల సీజన్ ప్రారంభమైపోయింది.. ఇప్పటికే బోనాల పాటలు అదరగొడుతున్నాయి.. ప్రతీ పండుగకు ఓ పాట విడుదల చేసినట్టుగానే.. ఈ సారి కూడా ఓ పాటను వదిలారు సింగర్ మంగ్లీ.. అయితే, పాటలోని కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారంటూ మంగ్లీపై రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని పేర్కొన్న నేతలు.. తక్షణమే…