తెలంగాణ బీజేపీలో సంచలన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధిష్టానం పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవిని వరించింది. గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. జేపీ నడ్డా ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదని, కాంగ్రెస్ పార్టీకే ప్రమాదం ఉందని అన్నారు. దేశంలో ప్రమాదంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకే తప్ప ప్రజాస్వామ్యానికి కాదన్నారు.