నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోయారంటూ టీఆర్‌ఎస్ శ్రేణులు శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ కార్యకర్తలతో ఘర్షణకు దిగి రాళ్లతో దాడి చేయడంతో ధర్పల్లి మండలంలో విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంపీ అరవింద్ వస్తున్నారని తెలుసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని టీఆర్‌ఎస్…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోలీసుల సర్వేలోనూ 70 శాతం ఈటల రాజేందరే గెలుస్తాడని తేలిందని వ్యాఖ్యానించారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్… రెండ్రోజుల తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తానని.. ఎక్కడ ఆపానో అక్కడే ప్రారంభిస్తా.. రెండు రోజులు హుజురాబాద్‌లో అందుబాటులో ఉంటా.. పరిస్థితులు సమీక్షిస్తా.. కార్యకర్తలు, నాయకులను కలుస్తా అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18 ఏళ్ల చరిత్రలో సీరియస్ గా పని…