ఏపీలో కేబినెట్ కూర్పుపై తర్జన భర్జన పడుతున్నారు వైసీపీ నేతలు. ఎవరికి అవకాశం ఇవ్వాలి. ఎవరిని కొనసాగించాలనేదానిపై సుదీర్ఘంగా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ ముగిసింది. వరుసగా రెండో రోజు మూడు గంటల పాటు కొనసాగింది సమావేశం. దాదాపుగా కొత్త మంత్రివర్గం జాబితా సిద్ధమయిందని తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, అనుభవం, పార్టీకి విధేయత అంశాల ఆధారంగా జాబితాను సిద్ధం చేశారంటున్నారు. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్…