Milk Bread Dessert: కేవలం 10 నిమిషాల్లోనే ఫైవ్ స్టార్ రేంజ్ స్వీట్! ఎలా చేయాలో చూసేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milk Bread Dessert: ఇంట్లో ఏదైనా స్పెషల్ డే ఉన్నా లేదా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినా.. తక్కువ ఖర్చుతో, తక్కువ ఇంగ్రిడియంట్స్ తో చేసుకునే అద్భుతమైన రెసిపీ ఈ ‘మిల్క్ బ్రెడ్ డెసర్ట్’. కేవలం రెండు కప్పుల పాలు, కొన్ని బ్రెడ్ ముక్కలు ఉంటే చాలు, వంటరాని వాళ్ళు కూడా దీనిని ఎంతో సులువుగా తయారు చేయవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: S.S.Thaman: త్రివిక్రమ్ నా గురువు.. వచ్చే సినిమాతో ఆస్కారే లక్ష్యం!
Also Read
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
దీనికి కావలసిన పదార్థాలు..
పాలు: 2 కప్పులు (అర లీటర్ – వీలైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్)
బ్రెడ్ స్లైసెస్: 6 నుంచి 8
కస్టర్డ్ పౌడర్: 2 టేబుల్ స్పూన్లు (వెనిలా ఫ్లేవర్)
పంచదార: 4 టేబుల్ స్పూన్లు (కస్టర్డ్ కోసం) + 1/4 కప్పు (షుగర్ సిరప్ కోసం)
నెయ్యి: 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: 1/2 టీస్పూన్
డ్రై ఫ్రూట్స్: బాదం, పిస్తా (సన్నగా తరిగినవి)
ఫ్లేవర్ కోసం: కుంకుమపువ్వు, రోజ్ వాటర్, ఎండిన గులాబీ రేకులు (ఆప్షనల్)
తయారీ విధానం ఇదే..
మొదట స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో అర లీటర్ పాలు పోసి మీడియం ఫ్లేమ్ మీద మరిగించాలి. ఈలోపు ఒక చిన్న బౌల్‌లో కస్టర్డ్ పౌడర్ తీసుకుని, కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. పాలు మరిగాక, మంట తగ్గించి ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని పాలలో వేస్తూ కలుపుతూ ఉండాలి. మిశ్రమం చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆపేసి, దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటి నాలుగు వైపులా ఉండే బ్రౌన్ పార్ట్‌ను కట్ చేసి, ఒక్కో బ్రెడ్ ను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. అనంతరం పాన్‌లో నెయ్యి వేసి ఈ బ్రెడ్ ముక్కలను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పావు కప్పు పంచదార, అర కప్పు నీళ్లు పోసి కరిగించాలి. ఇందులో మంచి సువాసన కోసం రోజ్ వాటర్, గులాబీ రేకులు వేసి 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. ఈ సిరప్ వేడిగా ఉన్నప్పుడే వేయించిన బ్రెడ్ ముక్కలను అందులో డిప్ చేసి వెంటనే తీసేయాలి.
తరువాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని మొదట ఒక లేయర్ కస్టర్డ్ మిల్క్ వేయాలి. దానిపై షుగర్ సిరప్‌లో ముంచిన బ్రెడ్ ముక్కలను అమర్చాలి. ఇలా లేయర్ బై లేయర్ వేసిన తర్వాత పైన పిస్తా పలుకులతో గార్నిష్ చేయాలి. ఈ డెసర్ట్‌ను తయారు చేసిన 10-15 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే బ్రెడ్ ముక్కలు కస్టర్డ్ ని పీల్చుకుని చాలా బాగుంటాయి. బ్రెడ్ ముక్కలు మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడే తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీకు ఇష్టమైతే దీనిని ఫ్రిజ్‌లో పెట్టి కూల్ అయిన తర్వాత తింటూ ఎంజాయ్ చేయవచ్చు. తక్కువ సమయంలో, అత్యంత రుచికరంగా తయారయ్యే ఈ ప్రీమియం డెసర్ట్‌ని మీరు కూడా టైం ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి.
READ ALSO: Tamil Nadu: ఘోర విషాదం.. బస్సు-వ్యాన్ ఢీ.. 11 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి
తాజావార్తలు
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!