Pakistan summons US envoy over Joe Biden's comments: పాకిస్తాన్ దేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలపై సమన్వయం లేని కారణంగా పాకిస్తాన్ ప్రపంచంలోనే ప్రమాదకర దేశాల్లో ఒకటి అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ దేశాన్ని షాక్ కు గురిచేశాయి. అమెరికాతో ఇప్పుడిప్పుడే సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నామని అనుకుంటున్న పాకిస్తాన్ కు ఇది మింగుడు పడటం లేదు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తమ నిరసన తెలుపుతోంది.