రోడ్డు ప్రమాదాలు మామూలైపోయాయి. ఇటీవల ప్రారంభం అయిన షేక్ పేట నూతన ఫ్లైఓవర్ నెత్తురోడింది. షేక్‌పేట్ ఫ్లై ఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ పై వెళుతున్న బైక్‌ను ఢీ కొంది. దీంతో ఫ్లై ఓవర్ పై నుంచి బైక్ తో సహా కింద పడ్డాడు ఆ యువకుడు. దీంతో బ్రిడ్జి పై బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి వంతెనపై నుండి పడిపోయాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి…
ఉదయాన్నే కాలేజీకి వెళ్లిన కూతురు శవమై తిరిగి ఇంటికివస్తే ఆమె తల్లిదండ్రుల మనోవేదన వర్ణానాతీతం. ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. గాజులరామరంకు చెందిన మేఘన దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుంది. నేడు మధ్యాహ్న సమయంలో మరో స్నేహితురాలు సుమనశ్రీ తో కలిసి కళాశాల నుంచి తిరుగు ప్రయాణంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేఘన…
విశాఖపట్నంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో డివైడర్ ను బైక్ ఢీకొట్టడంతో అదుపుతప్పి యువతీ, యువకుడు మృతి చెందారు. మృతులు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ (22), ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మురళీనగర్ ప్రాంతానికి చెందిన రాధిక(17) గా పోలీసులు గుర్తించారు. సీతమ్మధారలోని ఓ సెలూన్‌లో ప్రశాంత్ పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు తలకు బలమైన గాయం అవ్వడంతో ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు.…
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పామర్రు మండలం కాపవరం వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్ దాటి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు దగ్డమైంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మొవ్వ మండలం కాజా గ్రామానికి చెందిన కామేశ్వర రెడ్డి…