విశాఖపట్నంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో డివైడర్ ను బైక్ ఢీకొట్టడంతో అదుపుతప్పి యువతీ, యువకుడు మృతి చెందారు. మృతులు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ (22), ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మురళీనగర్ ప్రాంతానికి చెందిన రాధిక(17) గా పోలీసులు గుర్తించారు.
సీతమ్మధారలోని ఓ సెలూన్‌లో ప్రశాంత్ పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు తలకు బలమైన గాయం అవ్వడంతో ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రాధికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.