ఉదయాన్నే కాలేజీకి వెళ్లిన కూతురు శవమై తిరిగి ఇంటికివస్తే ఆమె తల్లిదండ్రుల మనోవేదన వర్ణానాతీతం. ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. గాజులరామరంకు చెందిన మేఘన దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుంది. నేడు మధ్యాహ్న సమయంలో మరో స్నేహితురాలు సుమనశ్రీ తో కలిసి కళాశాల నుంచి తిరుగు ప్రయాణంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మేఘన అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థిని గాయలపాలయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ విద్యార్థినిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మేఘన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.