నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం వంటి కారణాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మితిమీరిన వేగంతో, అజాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువతి తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read:Gold Rates Today: అమ్మబాబోయ్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై శ్రీకృష్ణ మందిరం వద్ద తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న అనంత్ (23) అనే యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనకాల కూర్చున్న మరో యువతి సంజన (22) తలకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాదు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నది. వీరి స్వస్థలాలు హైదరాబాదులోని ఈసీఐఎల్ కు చెందిన అనంత్, సంజనగా గుర్తించారు. భిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.