కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. కాంగ్రెస్ చొరబాటుదారులను కాపాడుతోందని తిప్పికొట్టారు. బీహార్‌లోని డెహ్రీలో షహాబాద్, మగధ్ ప్రాంతాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీహార్‌లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో బుధవారం స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్, డీఎంకే నేతలు గతంలో బీహారీయులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ గుర్తు చేసింది. వీటికి సమాధానం ఏదంటూ నిలదీస్తోంది.
ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడితే 48 గంటలు కస్టడీలో ఉంటే వెంటనే సస్పెండ్‌కు గురవుతారని.. అలాంటిది ఒక ముఖ్యమంత్రి గానీ.. ఒక మంత్రి గానీ.. ఒక ప్రధానమంత్రి గానీ జైల్లో ఉంటే వారెందుకు అధికారం అనుభవిస్తున్నారని మోడీ ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.