బీహార్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. అన్ని పార్టీలు ఎవరికి వారే గంపెడాశలు పెట్టుకున్నాయి. సర్వే ఫలితాలు అధికార కూటమికే అనుకూలంగా ఉన్నా.. విపక్ష కూటమి కూడా ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని చెబుతోంది.
Bihar Assembly Election Results: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు విడతల్లో ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత EVMల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు దృష్ట్యా, అన్ని జిల్లాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ సైతం అవసరమైన అన్ని సన్నాహాలు చేసింది.
బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహాకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీకి 150 సీట్లు వస్తాయని.. లేదంటే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.
Bihar Elections: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అధికార బీజేపీ+జేడీయూల ఎన్డీయే కూటమి, ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబంధన్ కూటమిలు ప్రచారాలు మొదలుపెట్టాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే కూటమి భావిస్తుంటే, దశాబ్ధానికి పైగా అధికారానికి దూరంగా ఉన్న ఆర్జేడీ గెలుపు రుచి చూడాలని అనుకుంటోంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6న ,నవంబర్ 11న రెండు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుంది.
Bihar Elections 2025: బీహార్ రాజకీయాలు హీట్ ఎక్కాయి. తాజాగా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ నితీష్ కుమార్ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. పలువురు విలేకరులు పప్పు యాదవ్‌తో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారా అని అడిగారు. దానికి ఆయన స్పందిస్తూ.. కచ్చితంగా కాదని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీ నితీష్‌ను గౌరవించదని ఆయన బదులిచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ ఆయనను గౌరవిస్తుందా అని అడిగినప్పుడు, పప్పు యాదవ్ స్పందించి…
బీహార్‌లో రసవత్తరంగా ఎన్నికల సమరం సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడ్ పెంచారు.