Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిని తుడిచిపెట్టేసింది.
10 Reasons For NDA Grand Victory in Bihar: ఎంతో ఉత్కంఠగా సాగిన హైవోల్టేజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎన్డీయే కూటమి మరోసారి జయభేరి మోగించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ బీహార్ ఓటర్లు నితీశ్ కుమార్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ను బీహార్ ప్రజలు తిరస్కరించారు. ఓవైపు వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్.. ఇంకోవైపు కుల రాజకీయాలు..…
Bihar Election Results: బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జేడీయూ, బీజేపీల తుఫానులో ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కొట్టుకుపోయాయి. 243 స్థానాలు ఉన్న బీహార్‌లో, ఏకంగా 185 నుంచి 190 స్థానాలు సాధించే దిశగా ఎన్డీయే వెళ్తోంది. ఇక ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమి 50 లోపు స్థానాలకు మాత్రమే పరిమితమవుతోంది. ఈసారి కూడా ఆర్జేడీ కూటమికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి.
Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 64.46 శాతం నమోదైనట్లు, మరికొన్ని స్థానాల్లో ఇంకా ఓటింగ్ జరుగుతున్నట్లు బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి వినోద్ గుంజ్యాల్ చెప్పారు. 73 ఏళ్ల బీహార్ ఎన్నికల చరిత్రలో ఇదే హైయెస్ట్. 2020లో జరిగిన ఎన్నికల్లో మొదటిదశలో నమోదైన దాని కన్నా ఎక్కువ నమోదైంది.
మైథిలి ఠాకూర్.. జానపద గాయని. అనూహ్యంగా ఈ ఏడాది రాజకీయ ప్రవేశం చేశారు. అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆర్జేడీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. అప్పటి నుంచి బీహార్‌తో అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. ఇక మైథిలి ఠాకూర్‌కు సొంత ప్రాంతంలో కాకుండా అలీనగర్ సీటును బీజేపీ కేటాయించింది.
బీహార్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా.. మొదటి విడతగా 121 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు కౌంట్‌డౌన్ మొదలైంది. నేటితో మొదటి దశ ఎన్నికలకు ప్రచార గడువు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చు. ప్రచార గడువు ముగియగానే.. నియోజకవర్గాల నుంచి నాయకులు వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం (ఈసీ)ఇప్పటికే స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తల ఎవరూ సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేయవద్దని ఈసీ సూచించింది. గురువారం (నవంబర్ 6) తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.…
Bihar Election 2025: బీహార్ ఎన్నికలకు మరో ఐదు రోజులు మాత్రమే సమయంలో ఉంది. 243 సీట్లకు రెండు విడుతలుగా నవంబర్ 6, 11న ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న వెలువడుతాయి. ఈ ఎన్నికలు అధికార బీజేపీ+జేడీయూల ఎన్డీయే కూటమికి, ప్రతిపక్ష మహాఘటబంధన్ లోని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్షాల కూటమికి ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే అనుకుంటుంటే, ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఆర్జేడీ కూటమి భావిస్తోంది.
Bihar Election 2025: దేశ వ్యాప్తంగా ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ, ఊహించని సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. నామినేషన్ల పరిశీలన తర్వాత, మూడు అసెంబ్లీ స్థానాల్లో అకస్మాత్తుగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ స్థానాల్లో రెండు మహా కూటమికి చెందినవి కాగా, ఒకటి NDAకి చెందింది. వాస్తవానికి ఈ మూడు స్థానాల్లో ముగ్గురికి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అసెంబ్లీ స్థానాలు…
Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే బీజేపీ, దాని మిత్రపక్షం జేడీయూలు తొలి విడత అభ్యర్థుల లిస్ట్‌లను విడుదల చేశాయి. పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రఘోపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి, హ్యట్రిక్ సాధించాలని తేజస్వీ లక్ష్యంగా పెట్టుకున్నారు.