Bihar Reservations: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పాట్నా హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా ఓబీసీ, ఈబీసీ, దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచింది.
బీహార్‌లో మహాఘటబంధన్ కూటమిని నితీష్ కుమార్ విడిచిపెట్టి ఎన్డీయేతో చేరిన కొద్ది రోజుల తర్వాత, నితీష్ ఇండియా కూటమిని వీడడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం మౌనం వీడారు. బీహార్ కులాల సర్వే కారణంగానే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నిష్క్రమించారని రాహుల్ గాంధీ అన్నారు.
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరిగిన కులగణనలో ఉద్దేశపూర్వకంగా ముస్లింలు, యాదవుల జనాభాను పెంచారని, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.