Bihar Elections 2025: బీహార్‌లో షాకింగ్.. రోడ్డుపై VVPAT స్లిప్పులు లభ్యం..! ఈసీపై అనుమానాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections 2025: బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు కనిపించాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ, పారదర్శకత, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ప్రశ్నించింది. “సమస్తిపూర్ సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డుపై ఈవీఎంల నుంచి పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు విసిరేశారు. ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరి ఆదేశం మేరకు ఈ స్లిప్పులు విసిరేశారు..? కమిషన్ దీనికి సమాధానం ఇస్తుందా? బయటి నుంచి వచ్చి బీహార్‌లో మకాం వేసిన ప్రజాస్వామ్య దొంగ ఆదేశం మేరకు ఇదంతా జరుగుతుందా?” అని ప్రశ్నించింది.
READ MORE: IND vs AUS 5th T20: వర్షం కారణంగా రద్దైన గబ్బా T20 మ్యాచ్.. సిరీస్ భారత్ కైవసం
Also Read
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
ఈ అంశంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ సత్వర చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ARO)ను సస్పెండ్ చేశారు. ఆయనపై FIR నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సమస్తిపూర్ జిల్లా ఎన్నికల అధికారి (జిల్లా మేజిస్ట్రేట్) సంఘటన స్థలాన్ని సందర్శించి, దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ VVPAT స్లిప్‌లను మాక్ పోల్ సమయంలో ఉపయోగించారని, ARO నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎన్నికల సంఘం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇది వాస్తవ ఓటింగ్ ప్రక్రియ సమగ్రతను ప్రభావితం చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్థులందరికీ జిల్లా మేజిస్ట్రేట్ సమాచారం అందించింది.
READ MORE: Motorola Edge 50 pro: మోటరోలా ఫోన్ పై క్రేజీ డీల్.. రూ.36 వేల ఫోన్ రూ.23 వేలకే.. కర్వ్డ్ డిస్ప్లేతో
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న జరిగింది. సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం పోలింగ్ నిర్వహించారు. EVMలు, VVPATల పనితీరును పరీక్షించేందుకు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి పోలింగ్ బూత్‌లో మాక్ పోల్స్ నిర్వహిస్తారు. ఓటింగ్ పూర్తయిన రెండు రోజుల తర్వాత, శీతల్‌పట్టి గ్రామంలోని చెత్తలో VVPAT స్లిప్‌లు కనిపించాయి. మహా కూటమిలోని పార్టీలు ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. వివాదం తీవ్రమవుతున్నట్లు గమనించిన సమస్తిపూర్ జిల్లా మేజిస్ట్రేట్ రోషన్ కుష్వాహా, పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ ప్రతాప్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని ప్రతిపక్ష పార్టీలకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!