కరోనా వైరస్ తగ్గెదేలే అనే విధంగా రోజురోజుకు పెరిగిపోతోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలను భయపడుతోన్న కరోనా రక్కసి.. ఒమిక్రాన్ వ్యాప్తి మరోసారి విజృంభిస్తోంది. కరోనా కేసులు దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్న వేళ పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను కఠిన తరం చేశారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా 2,68,833 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు గడిచిన 24 గంటల్లో 1,22,684 మంది కరోనా నుంచి…
దక్షిణాఫ్రికాలో గత 15 రోజుల క్రితం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి భారత్‌తో పాటు పలు దేశాలు కోలుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ బయటపడడంతో మరోసారి యావత్త ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. డెల్టావేరియంట్ కంటే 6రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే పలు దేశాల్లో రోజు పదుల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్‌లో కూడా ఒమిక్రాన్ తన ఉనికిని చూపెడుతోంది.…