Bomb Threat: విమానంలో బాంబు బెదిరింపు రావడంతో జైపూర్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX 196 లో బాంబు ఉన్నట్లు అర్ధరాత్రి 12.45 గంటలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో దుబాయ్ నుంచి జైపూర్ వస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దుబాయ్ నుంచి జైపూర్‌కు అర్ధరాత్రి 12:45 గంటలకు వస్తున్న అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయంలో…
ఇటీవల సీఎం కేసీఆర్ రాజ్యాంగం చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొత్త రాజ్యాంగాన్ని ప్రతిపాదిస్తున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.…
ఇంటిటికీ వెళ్లి హెల్త్ ప్రొఫైల్ తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ముందుగా ఈ కార్యక్రమం ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ మొదటి డోస్ లో భారత దేశం లో తెలంగాణ ముందు ఉందని, సౌత్ ఇండియా లో రెండు డోస్ లు వేసుకున్న జిల్లాలు గా కరీంనగర్, హన్మకొండ జిల్లాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చింది అంటే మనిషి చనిపోయాడు అనుకునే వారు.. ప్రపంచ…
సోమవారం రాత్రి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో మేస్రం కులస్తుల ధార్మిక, సాంస్కృతిక సంబంధమైన వార్షిక నాగోబా జాతరను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. మేస్రం పెద్దలు మరియు పూజారుల ప్రకారం, ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాత్రి 10 గంటలకు వంశంలోని సభ్యులు మహాపూజతో ప్రారంభించనున్నారు. పాదయాత్రగా వెళ్ళితెచ్చిన పవిత్ర గంగాజలం తో నాగోబాను మేస్రం వంశీయులు అభిషేకించనున్నారు. మహాపూజతో ఈ జాతర వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ జాతర…
గుడివాడ క్యాసినో అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నిజ నిర్ధారణకమిటీ సభ్యులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే తాజాగా టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. విజయవాడ కలెక్టర్ కు గుడివాడ క్యాసినో, తనిఖీ వెళ్లిన…