ఒడిశాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ ఫుడ్‌లో చనిపోయిన కప్ప దర్శనమిచ్చింది. ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు వడ్డించిన ఆహారంలో చనిపోయిన కప్ప కనిపించడంతో విద్యార్థులు కంగుతిన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ ఒడిశాలోని కటక్-భువనేశ్వర్‌లోని ఆసుపత్రులను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న ట్రిపుల్ రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించే అవకాశం ఉంది.
CARE Hospitals: ప్రొస్టేట్ సమస్యతో బాడప్పడుతున్న వారికీ ఆపరేషన్ అవసరం లేకుండా ఒక్క అధునాతన చికిత్సను ఇప్పుడు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ అందుబాటులోకి తెచ్చింది.. విస్తారిత ప్రొస్టేట్ సమస్య తో బాధపడుతున్న పురుషులకు ఇప్పుడు నూతన, మరియు అధునాతన, అతితక్కువ హానికర చికిత్సను బంజారాహిల్స్, కేర్ హాస్పిటల్స్ లో అందిస్తున్నట్లు ఆసుపత్రి యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. వంశీ కృష్ణ ఈ రోజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పుడు తెలంగాణ మరియు…
President Droupadi Murmu Gets Emotional As She Visits Her School In Odisha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి తను చదువుకున్న పాఠశాల, హాస్టల్ ని సందర్శించారు. ఈ క్రమంలో తన చిన్ననాటి గుర్తులను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఒడిశా పర్యటనలో రెండో రోజు రాజధాని భువనేశ్వర్ లోని యూనిట్-2 ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. 1970వ దశకంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ…
ఫేస్‌బుక్ వేదికగా ప్రముఖ వ్యాపారులు, రాజకీయ నాయకులు, సినీ నిర్మాతలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి నెమ్మదిగా వారితో మాట కలుపుతుంది. కాస్త స్నేహం కాగానే తీయని మాటలతో మాయ చేస్తుంది. ఆమె వలపు వలలో పడిన బాధితులు ఆమె చెప్పేవన్ని నిజాలనుకుని నమ్మేస్తారు.
ప్రస్తుత సమాజంలో నేటి యువత మద్యానికి బానిసై తమ నిండు జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. తాగిన మత్తులో కన్నుమిన్ను ఎరుగక అనర్థాలకు పాల్పడుతున్నారు. ఆడమగ అని తేడా లేకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఎక్కడ పడితే అక్కడ గొడవలకు పాల్పడుతున్నారు. అంతేకాదు తెలియని మైకంలో వాళ్లు చేస్తున్న ఆగడాలకు వాళ్లే బలి అవుతున్నారని తెలుసుకునేలోపే అనర్థాలు జరిగిపోతున్నాయి. మద్యం మత్తులో ఓయువతి హైదరాబాద్ లోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హల్ చల్ చేసింది. మద్యం మత్తులో…
యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. పగలు, రాత్రులు అని తేడా లేకుండా చోరీలకు పాల్పడుతూ రూ.లక్షల విలువ చేసే సొత్తును దోసుకెళుతున్నారు. ఎండాకాలం ఆరుబయట నిద్రిస్తున్న వారే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగేం గ్రామంలో ఎండాకాలం రాత్రి పుట ఆరుబయట నిద్రిస్తున్న అండాలు అనే మహిళ మెడలోంచి నాలుగు తులాల బంగారం గొలుసును గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు.…
లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో అక్కడికక్కడే నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒడిశాలో కలకలం రేపుతోంది.. ఒడిశా ఖుర్దాలో ప్రజలపైకి దూసుకెళ్లింది ఎమ్మెల్యే ప్రశాంత్జగ్దేవ్కారు… ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 25 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలిపారు.…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు భువనేశ్వర్‌లో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన స్టూడెంట్స్ విభాగం నేతలు కోడి గుడ్లతో దాడి చేశారు. ఆయన భువనేశ్వర్ నుంచి కటక్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మంత్రి కాన్వాయ్‌ను ముందుకు వెళ్లకుండా విద్యార్థి నాయకులు నల్ల బ్యాడ్జీలను ప్రదర్శించి అడ్డుకున్నారు. లఖింపుర్‌ఖేరి హింసాత్మక ఘటనలో అజయ్ మిశ్రా కొడుకు, ఆశిష్ మిశ్రా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆశిష్ మిశ్రాపై రైతుల పైకి…
కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఈ ఏడాదే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.. మరోవైపు.. మరోవైపు 18 ఏళ్లకు దిగునవారికి వ్యాక్సినేషన్‌పై ట్రయల్స్ కొనసాగుతున్నాయి.. చిన్నారులకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఇక, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఎన్ని రోజులు ఉంటాయనేదనిపై రకరకాల పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగుతున్నాయి.. కోవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న నాలుగు నెలల…