Madhya Pradesh: మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల ఆలయం కాంప్లెక్స్ ఆలయంలో రేపటి నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే ప్రారంభించనుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టనున్నట్లు ఏఎస్ఐ గురువారం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భోజ్‌శాల ఆలయం, కమల్ మౌలా మసీదు ‘మల్టీ డిసిప్లినరీ సైంటిఫిక్ సర్వే’ సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది.