ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ బృందాలు రాయ్‌పూర్, భిలాయ్‌లోని బాఘేల్ నివాసంతో పాటు ఓ సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా రైడ్స్ జరుపుతున్నారు. భూపేశ్ బాఘేల్ తో పాటు, సీబీఐ అధికారులు ఆయన సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసానికి కూడా చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.
Pushpa 2: పుష్ప-2 కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ. 1000 కోట్ల మార్క్‌ని దాటేసింది. ఉత్తరాదిని పుష్ప మానియా మామూలుగా లేదు. నార్త్ ఇండియాలో థియేటర్లు హౌజ్ ఫుల్ కలెక్షన్లను సాధిస్తున్నాయి. ఇందుకేనేమో దొంగలు థియేటర్లను టార్గెట్ చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ బిలాయ్ నగరంలో ‘‘పుష్ప 2: ది రూల్’’ సినిమాని ప్రదర్శిస్తున్న థియేటర్‌లో దోపిడి జరిగింది.