‘రాజీవ్ యువ వికాసం’ పథకంపై మంత్రి కీలక వ్యాఖ్యలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ,మైనార్టీల,వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కొరకు రాజీవ్ యువ వికాసం కార్యక్రమని, రాష్ట్రంలో ఉన్న యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో…
Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థులు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియపై సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు మార్గదర్శకాలను వెల్లడించారు.…
Bhatti Vikramarka : ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, వ్యూహాలు, విధానాల రూపకల్పనతో పాటు రాజకీయ నిర్ణయాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇందులో డ్రాఫ్టింగ్ కమిటీ ప్రధాన భూమికను పోషించనుంది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు జనరల్ సెక్రటరీ కే.సి. వేణుగోపాల్ ఈ…
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు గురువారం రాత్రి నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 11 రోజులపాటు నిరంతరంగా కొనసాగిన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక అంశాలను చర్చించి, ఆమోదం తెలిపింది. సభలో ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు పలు ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు సభ సమావేశమైంది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ఉభయసభల్లో…
గురువారం ఉదయం 10 గంటలకి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు డీలిమిటేషన్పై ప్రభుత్వ తీర్మానంను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ తీర్మానం అనంతరం సభలో ద్రవ్య వినిమయ బిల్లు, అవయవ దానం బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 12వ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. 11 రోజుల పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలతో…
మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మంత్రులు ఎందుకు ఎగ్జైట్ అవుతారు.. మంత్రులకు సంయమనం ఉండాలి అన్నారు. మేము అడుగుతాం.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వలేదని అంటాం.. ఇక, 30 శాతం కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. నీలాగా విలువలు లేని రాజకీయాలు చేయడం లేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ మండిపడ్డారు. దోచుకున్న ది నువ్వు.. రాష్ట్రాన్ని సర్వ నాశనం…
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు (మార్చ్ 26) శాసన సభలో బడ్జెట్ పద్దులపై నాలుగో రోజు చర్చ కొనసాగనుంది. అసెంబ్లీలో వివిధ శాఖల పద్ధులపై చర్చ జరగనుంది.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు బయలు దేరారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన వీరు, సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు. ఈ హఠాత్ పర్యటన వెనుక ప్రధాన కారణం కేబినెట్ విస్తరణ కావొచ్చని…
Harish Rao: రాష్ట్ర శాసన సభ చరిత్ర లో ఇది చీకటి రోజు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. క్లారిఫికేషన్ ఇవ్వకుండా సభ వాయిదా వేశారు.. సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది.. 20 శాతం కమిషన్ ఏ ప్రభుత్వం హయంలో జరగలేదు.. బీఆర్ఎస్ హయంలో ప్రాజెక్టులు కట్టాం.. రైతు బంధు ఇచ్చాం.
Deputy CM Bhatti: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇస్తూ.. గత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రయత్నించింది అని ఆరోపించారు. వాళ్ల హయాంలో బడ్జెట్లో 38 శాతం ఖర్చు పెట్టలేదు, ఆ నిధులను ఎవరికి కేటాయించారు అని అడిగారు.