Congress: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85 ప్లీనరీ జరుగుతోంది. 2024 సాధారణ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టేలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. థర్డ్ ఫ్రంట్ బీజేపీకి ఎన్నికల్లో మాత్రమే సాయపడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో పోరాడేందుకు భావసారుప్యత కలిగిన లౌకిక పార్టీలతో, విపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని అని…
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి విరమణ చేయడాన్ని ప్రస్తావించారు. భారత్ జోడో యాత్ర పార్టీకి కీలక మలుపు అని ఆమె అన్నారు. నా ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిస్తుంది అని అన్నారు. భారత ప్రజలు సామరస్యం, సహనం మరియు సమానత్వాన్ని కోరుకుంటున్నారని యాత్ర నిరూపించిందని అన్నారు.
Rahul Gandhi criticizes BJP in Adani case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో అదానీ వ్యవహారం, అగ్నివీర్ స్కీమ్ గురించి విమర్శించారు. భారత్ జోడో యాత్ర అనుభవాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతుల సమస్యలు నా దృష్టికి వచ్చాయని వెల్లడించారు. అగ్నివీర్ యోజన సైనికులు నుంచి వచ్చిన ఆలోచన, ప్రతిపాదన కాదని, ఈ ఆలోచన, ప్రతిపాదన జాతీయ భద్రత సలహాదారు…
Rahul Gandhi Capable Of Being India's PM,Says Sanjay Raut: భారత జోడో యాత్రతో దేశంలో పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు శనివారం రాహుల్ గాంధీతో కలిసి శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం)నేత, ఎంపీ సంజయ్ రౌత్ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై సంజయ్ రౌత్ ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప థర్డ్ ఫ్రంట్ కు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత దేశానికి…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ముగిసింది.. తుంగభద్ర బ్రిడ్జిపై కర్ణాటకలోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ… అయితే, ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్న ఆయన.. ఇక్కడి వ్యక్తులతో నేను అనుభవించిన ప్రేమ బంధం లోతైనది మరియు దృఢమైనది అని రాసుకొచ్చారు.. అంతే కాదు.. ఈ ప్రేమకు…