మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్ధిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎం తెలిపారు. ఆలస్యమైనా వారికి ఈ గౌరవం దక్కడం గర్వకారణం ఉందని పేర్కొన్నారు. నా తరపున, సభ తరపున, తెలంగాణ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత రత్న అవార్డు ఇవ్వడం పట్ల పీవీ స్వగ్రామం వంగర గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. పీవీకి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. భారత దేశానికి ఆర్థిక సంస్కరణలు తెచ్చి అభివృద్ధికి తోడ్పడిన పీవీని గౌరవించడం సంతోషకరం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా.. పీవీ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా.. బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని…
PV Narasimha Rao: దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందంటే, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే దానికి ముఖ్యకారణం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చేసిన సంస్కరణలే కారణం. లైసెన్స్ రాజ్ నడిచే కాలంలో సరళీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధానిగా పీవీ, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక పరిస్థితిని గాడి పెట్టారు. దివాళా తీసే దశ నుంచి ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టేలా ఈ ఇద్దరి ధ్వయం ఎన్నో సంస్కరణలు చేసింది.
Bharat Ratna PV Narasimha Rao: కుప్పకూల బోతున్న భారత ఆర్థిక వ్యవస్థను తన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ ను రూపొందించడంలో మాజీ ప్రధాని స్వర్గీయ
Bharataratna : దేశ మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌లను భారతరత్నతో సత్కరించనున్నారు. దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం మన ప్రభుత్వ అదృష్టమని ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ రాశారు.
బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీని బీజేపీ అగ్రనేతలు కలిశారు. ఇటీవల అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అద్వానీకి అభినందనలు తెలిపారు.
Jairam Ramesh: బీజేపీ నేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. ప్రధాని మోడీ, ఎల్‌కే అద్వానీకి సంబంధించి రెండు సంఘటనల గురించి ఆయన మాట్లాడారు. 2002లో నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అద్వానీ, ఆయనను కాపాడారని, ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలనుకున్నారని, వాజ్‌పేయి మోడీకి రాజధర్మాన్ని గుర్తు చేశారని జైరాం రమేష్ అన్నారు. ఆ సమయంలో ఎల్‌కే అద్వానీ నరేంద్రమోడీకి…
Asaduddin Owaisi: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి ఈ రోజు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించింది. అయితే, నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. అద్వానీకి భారతరత్న ఇవ్వడాన్ని ఎగతాళి చేశారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘‘ ఎల్‌కే అద్వానీకి భారతరత్న దక్కింది. హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరేదీ కాదు’
Bharat Ratna Award Winners: బీజేపీ కురువృద్ధులు, ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీకి భారత ప్రభుత్వం ఈ రోజు అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ని ప్రకటించింది. 1954న స్థాపించబడిని ఈ అవార్డు కళలు, సాహిత్యం, సైన్స్, ప్రజాసేవ, క్రీడలతో సహా వివిధ రంగాల్లో విశేష సేవ చేసినవారికి ప్రదానం చేస్తున్నారు.
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి ఈరోజు భారత ప్రభుత్వం అత్యున్నత అవార్డు భారతరత్నను ప్రదానం చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక వ్యక్తిగా నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, నా జీవితాంత నా శక్తి మేరకు సేవ చేయడానికి నేను ప్రయత్నించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా గౌరమని అన్నారు. 96 ఏళ్ల అద్వానీ తాను 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్‌లో చేరి సమయాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీ…