గాంధీజీ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మార్గం ప్రపంచ మానవాళికి దిశానిర్దేశమన్నారు. ప్రస్తుతం దేశంలో అనేక రకాల అశాంతి, విభజన చోటు చేసుకుంటుందన్నారు.
ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే నెల్సన్ మండేలా లాంటి నాయకులకు గాంధీ స్ఫూర్తి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచానికి గాంధీయిజాన్ని పరిచయం చేసిన గొప్ప మహనీయుడన్నారు.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అక్టోబర్ 24 నుండి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది.
కాంగ్రెస్ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' కర్ణాటకలోకి అడుగుపెట్టింది. కర్ణాటకలో అడుగుపెట్టిన రాహుల్‌గాంధీకి రాష్ట్ర సరిహద్దులోని గుండ్లుపేట్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో 18వ రోజు విజయవంతంగా సాగుతోంది. భారత్ జోడో యాత్రలో పలుమార్లు ఉద్విగ్న సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి.
Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది. గత రెండు వారాలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన యాత్ర ప్రస్తుతం కేరళలో సాగుతోంది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ వెళ్లారు. దీంతో శుక్రవారం ఒక రోజు భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది. మళ్లీ సెప్టెంబర్ 24 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుకానుంది. శనివారం నుంచి జరిగే…
Petition in Kerala High Court on India Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ గత వైభవం కోసం, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ‘ భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 14వ రోజుకు చేరింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర…
Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించడంతో ఈ సారి గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు వచ్చే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి వీర విధేయుడని అశోక్ గెహ్లాట్ కు పేరుంది. అయితే అశోక్ గెహ్లాట్ మాత్రం ఇటు…
Rahul Gandhi-Congress Party Presidential Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే పదవిని చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పార్టీ సీనియర్ లీడర్ల నుంచి.. సామాన్య కార్యకర్త వరకు రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాల కాంగ్రెస్ యూనిట్లు రాహుల్ గాంధీ అధ్యక్షుడు కావాలని ఏకగ్రీవం తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు తీర్మానాలు చేశాయి.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. తన యాత్రలో రాహుల్ గాంధీ చలాకీగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఏ మాత్రం అలసట లేకుండా ఆయన ముందుకు సాగిపోతున్నారు. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన కేరళలో పర్యటిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ తన పాదయాత్ర మధ్యలో దొరికిన విరామాన్ని ఉల్లాసంగా గడుపుతున్నారు. సోమవారం నాడు కేరళలో పర్యటిస్తున్న సందర్భంగా పున్నమాడ సరస్సులో జరిగిన స్నేక్ బోట్…