యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కలిసి ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’, ఐశ్వర్య రాజేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలతో విజయాలు అందుకున్న నేపథ్యంలో, వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, రూపొందిస్తున్న రెండవ చిత్రమిది. మహేశ్వర రెడ్డి మూలి నిర్మాతగా, నూతన దర్శకుడు భరత్ దర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను *’ఓ..! సుకుమారి’*గా…
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో విజయం సాధించిన నటుడు తిరువీర్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా, ప్రతిభావంతమైన నటి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రాన్ని గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మహేశ్వరరెడ్డి మూలి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. పూర్తిగా వినోదభరితమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం…