తెలుగు చలనచిత్ర సీమలో 'భరణీ పిక్చర్స్' సంస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మహానటి భానుమతి, ఆమె భర్త దర్శకనిర్మాత పి.రామకృష్ణ ఈ సంస్థను నెలకొల్పారు. బహుముఖ ప్రతిభాపాటవాలకే కాకుండా, సాహసానికీ మారుపేరుగా నిలిచారు భానుమతి.
పురాణాల్లో భానుమతి అంటే దుర్యోధనుని భార్య అని తెలుస్తుంది. అయితే భారతంలో భానుమతి పాత్ర పెద్దగా కనిపించదు. కానీ, తెలుగు సినీభారతంలో మాత్రం బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భానుమతి. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితరసాధ్యం అనిపించకమానదు. మొదటి నుంచీ భానుమతికి ధైర్యం పాలూ ఎక్కువే. ఎదుట ఎంతటి మేటినటులున్నా, తనదైన అభినయంతో ఇట్టే వారిని కట్టిపడేసేవారు. ఇక ప్రతిభ ఎక్కడ ఉన్నా…
తెలుగు చిత్రసీమలో పాటల పందిరి అన్న మాటకు మొట్టమొదట అంకురార్పణ చేసిన చిత్రంగా వాహినీ వారి మల్లీశ్వరి నిలచింది. 1951 డిసెంబర్ 20న విడుదలైన మల్లీశ్వరి చిత్రం కళాభిమానులకు ఆనందం పంచుతూ విజయకేతనం ఎగురవేసింది. మహానటుడు యన్టీఆర్, మహానటి భానుమతి నటనావైభవానికి మచ్చుతునకగా మల్లీశ్వరి నిలచింది. 1951 మార్చి 15న విడుదలైన పాతాళభైరవి చిత్రం యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపితే, ఆయనలోని నటనను వెలికి తీసిన చిత్రంగా మల్లీశ్వరి నిలచింది. ఈ చిత్రం విడుదలై…
(సెప్టెంబర్ 7న భానుమతి జయంతి) సాటిలేని మేటి నటి భానుమతి రామకృష్ణ పేరు తలచుకోగానే ముందుగా ఆమె బహుముఖ ప్రజ్ఞ మన మదిలో మెదలుతుంది… నటిగా, గాయనిగా, నర్తకిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితర సాధ్యం… సెప్టెంబర్ 7న భానుమతి జయంతి… ఈ సందర్భంగా భానుమతి బహుముఖ ప్రజ్ఞను మననం చేసుకుందాం… నటిగానే కాదు గాయనిగానూ భానుమతి బాణీ విలక్షణమైనది… ఆమె గానం నిజంగానే తెలుగువారి మనసుల్లో…