ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీశైలం,కాశీపీఠాధిపతులు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కాశీ జ్ఞానసింహాసన నూతన పీఠాధిపతి మల్లికార్జున విశ్వరాధ్య,శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామాశివాచార్య దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, ఆలయచైన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అభిషేకం జరిపించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠాధిపతుల వెంట వివిధ మఠాలకు సంబంధించిన మఠాధిపతులు కూడా విచ్చేసి స్వామి అమ్మవారిని…
ఇవాళ నృసింహ జయంతి సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీరు అన్నీ శుభాలను పొందుతారు. నిత్యం మీలో ఏర్పడే సంఘర్షణకు ముగింపు లభిస్తుంది. మీ కుటుంబం సుఖసంతోషాలతో వుంటారు. https://www.youtube.com/watch?v=3LfIHZ3P75g
సింహాచలం అప్పన్న చందనోత్సవం కనుల పండువగా సాగుతోంది. చందనోత్సవానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ చందనోత్సవానికి హాజరయ్యారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర. లక్ష్మీనర్సింహ స్వామి నిజ రూపాన్ని దర్శించుకున్న స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర. ఏపీలో గొప్ప నారసింహక్షేత్రం సింహాచలం అన్నారు స్వరూపానందేంద్ర. సింహాద్రి అప్పన్నకు నిర్వహించే వేడుక చందనోత్సవం. వరాహ లక్ష్మీ నర్సింహ స్వామి దర్శనం సంతోషాన్నిచ్చిందన్నారు స్వరూపానందేంద్ర. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నానన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా చందనోత్సవానికి భక్తులను అనుమతించలేదన్నారు స్వరూపానందేంద్ర.…
విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సింహాచలం ఆలయంలో స్వామివారి చందనోత్సవంలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు తమిళిసై. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం అన్నారు తమిళిసై. తొలిసారి చందనోత్సవంలో పాల్గొన్నాను. ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి పవర్ ఫుల్ గాడ్, ఆలయంలో అడుగు పెడితేనే వైబ్రేషన్స్ ఉన్నాయ్ అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై.కొండపై స్వామివారి చందనోత్సవంకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. సాయంత్రం వరకు…
https://youtu.be/_Ef0pGg-NG4 ఈ సమస్త లోకాలకు సూర్యుడే ప్రధాన ఆధారం. ఆదివారం సూర్యదేవునికి ఎంతో ఇష్టమయిన వారం. ఆయన్ని ఆరాధిస్తే అన్నీ శుభాలే. అంతేకాదు, సూర్యకిరణాలు మనమీద పడితే సకల రోగాలు నశించిపోతాయి.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది.గతంలో లేని విధంగా ఈసారి భారీగా ఆదాయం సమకూరింది. ఖజానా కు గత ఆర్థిక సంవత్సరంలో 87.78 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరింది. కరోనా కారణంగా సుమారు రెండు నెలల పాటు భక్తులకు దర్శనాలు. నిలిపివేసినప్పటికీ, సమ్మక్క సారక్క జాతర జరగడంతో భక్తులు పోటెత్తారు. 2019-2020 ఆర్థిక సంవత్సరం లో స్వామివారికి లభించిన ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత ఆదాయం కాస్త పెరిగిందని అధికారులు చెబుతున్నారు. సమక్క సారలమ్మ జాతర…