ఆమె ఓ వివాహిత.. తొలుత సరదా కోసం ఆన్‌లైన్ రమ్మీ ఆడటం మొదలుపెట్టింది.. తర్వాత అది అలవాటైంది.. అనంతరం ఆ ఆటకి బానిసైంది. ఎంతలా అంటే.. లక్షల్లో అప్పులు చేసింది. నగలు కూడా విక్రయించింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. చివరికి ఆ భారం భరించలేక.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చావడిలోని ఓ హెల్త్ కేర్ సంస్థలో పని చేస్తోన్న భాగ్యరాజ్ కందన్.. ఆరేళ్ల క్రితం భవాని(29)ని ప్రేమించి…