హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై భాగ్యనగర్ ఉత్సవ సమితి, వీహెచ్పీ ఆందోళన చేపట్టారు. వినాయక నిమజ్జనం ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు.
ఈ సంవత్సరం వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. ఈనెల 19వ తారీఖున సాంప్రదాయబద్దంగా గణేష్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపింది.