తెలంగాణలో మావోయిస్టులు అస్థిత్వం కోసం పోరాడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులు కలకలం సృష్టించారు. చర్ల మండలంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు ప్రాంతాల మధ్య మందు పాతరను పేల్చారు. ఘటనలో గ్రేహౌండ్స్ఆర్ఎస్ఐ గాయపడ్డారు. పోస్టర్లు, వాహనాల విధ్వంసంతో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒకవైపు మావోయిస్టులు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటే.. రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌లతో వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ కొనసాగుతూనే వుంది.…
కార్తీక మాసం చివరిరోజు కావడంతో ఆదివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఏవీ నగరం నుంచి సుమారు వందమంది భక్తబృందం రామనామ స్మరణ చేస్తూ ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. మూలవరులకు ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆర్జిత సేవగా సువర్ణపుష్పార్చన, సహస్రనామార్చన, కేశవనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారిని నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చి…
కొత్తగూడెంలోని సింగరేణి గనుల్లో సమ్మె సైరన్ మోగింది. నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐదు డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచారు. కార్మికుల డిమాండ్లు ఏంటంటే… కళ్యాణి ఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకోవడం, అన్‌ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40 ఏళ్లకు పెంచడం, కార్మికుల అలియాస్ పేర్లను మార్చడం, ఏడాది…
ప్రభుత్వ ఆస్పత్రులపై ఎక్కువ మంది ప్రజలకు నమ్మకం ఉండదు. అక్కడ ఎక్విప్‌మెంట్ సరిగ్గా ఉండదని, వైద్యులు బాధ్యతగా వ్యవహరించరని అనుకుంటూ ఉంటారు. అందుకే వారు ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన చికిత్స అందుతుందంటూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలని పలువురు రాజకీయ నేతలు, అధికారులు తాపత్రయపడుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఓ జిల్లా కలెక్టర్ తన భార్యకు గవర్నమెంట్ ఆస్పత్రిలో ప్రసవం చేయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
కామాంధులకు వయస్సుతో సంబంధం లేదు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఆడవారిపై విరుచుకుపడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు కామాంధుల చేతులలో నలిగిపోతున్నారు. ఇందులో మైనర్ బాలురు ఉండడం గమనార్హం. ఇద్దరు బాలురు తమ ఇంటిపక్కన ఉండే మరో ఇద్దరు బాలికలను ఆడుకుందామని పిలిచి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే సుజాతనగర్‌లో నివాసముంటున్న ఇద్దరు బాలికలు 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్నారు. వారు రోజు సాయంత్రం ఇంటి బయట…
నాలుగు రోజులుగా కోడిపుంజులు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి. వాటికి బియ్యం అందిస్తూ పోలీసులు జాగ్రత్తగా చూస్తున్నారు. వాటి రంగుల ఆధారంగా మూడు పుంజులను త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలోని దంతలబోరు శివారులోని అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కోడిపందేలకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కోడిపందేలు నిర్వహిస్తున్న వారిని, మూడు కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయితే,…
సాధారణంగా ఎన్నికలు జరిగే సమయంలో ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తుంటారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తుంటారు. అయితే, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని చెక్ చెస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి రాజాపురం తదితర ప్రాంతాల్లో వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రాపురం గ్రామంలోకి ప్రవేశించే శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఆ మార్గం గుండా వచ్చి వెళ్లే…
గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో… సీనియర్ నటుడు,మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు డా.ఎం.మోహన్ బాబు పై కేసు పెట్టడం జరిగింది. ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్ల సందర్భంగా ”మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి..ఏమిటీ గొడవలు..ఏమిటి బీభత్సం… నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ,ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్… గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది..అతనూ చూస్తున్నాడు ఏం జరుగుతుందని. మా…