భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం నేల కూలింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆరు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న భవనం నాణ్యత లోపంతో కూలినట్టుగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో అందులో పనిచేస్తున్న కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. Also Read:Realme P3 5G: 50MP కెమెరా, 6.67-అంగుళాల HD+…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం న్యూ గొల్లగూడెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తుకు బానిసై డబ్బులు ఇవ్వమని వేధిస్తున్న కొడుకును, తల్లే హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. కొడుకు రాజ్ కుమార్ వేధింపులు తట్టుకోలేక తల్లి దూడమ్మ సంచలన నిర్ణయం తీసుకుంది. కొడుకును కాళ్లు కట్టేసి, కొట్టి ఉరివేసి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి ఆధ్వర్యంలో విచారణ…
Tummala Nageswara Rao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పూసుకుంట, కటుకూరు గ్రామాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ, చేనేత అనుబంధ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆయన ఈ సందర్బంగా ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితిష్ వి పాటిల్, ఐటిడి పిఓ రాహుల్ తో కలిసి పూసుకుంట నుండి రాచన్నగూడెం బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం పూసుకుంటకు చేరుకున్న…
Underground Mine: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని కొండాపురం మైన్ లోకి బుంగపడి లక్షల గ్యాలన్ల నీరు చేరుకుంది. దీంతో మైన్ ని మూసివేసి నీటిని తోడే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. పలు ప్రాంతాలనుంచి సింగరేణి రెస్క్యూ టీం లను రప్పించారు. ఈనెల ఆరవ తేదీ రాత్రి ఒక్కసారిగా బొగ్గు తవ్వకాలు చేపడు తుండగా 1.8 కిలోమీటర్ల లోపల ఉన్న బొగ్గు బ్లాక్ లో బుంగ పడింది . భారీ శబ్దాలతో నీరు ఉబికి రావడంతో…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో బావమరిదిపై ఎయిర్ గన్‌తో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బావమరిదికి గాయాలు కావడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు.
Terrible Inciden: సింగరేణిలో ఉద్యోగం అంటే ఆ దంపతులు నమ్మారు. ఉద్యోగం కోసం మరో మహిళకు రూ.16 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బులతో ఓ వ్యక్తిని నమ్మి తనతో పాటు వెళ్లిన మరో మహిళ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు.
గత నలభై ఏళ్లుగా ఇల్లందు నియోజక వర్గంతో నాకు అనుబంధం ఉందని, ఆదివాసీలు గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాచలం పినపాక ఇల్లందు నియోజక వర్గాల్లో ఎక్కువ సమయం కేటాయించా అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ పోలీస్ కానిస్టేబుల్ బుక్యా సాగర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తాజాగా నేడు చికిత్స పొందుతూ ఆయన మరణించారు. జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో బుక్యా సాగర్ విధులు నిర్వర్తించారు.
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించడంతో ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. కానీ ఉద్యోగాలు రాకపోవడంతో దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో చోటుచేసుకుంది.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన 15 మంది కూలీలు అరటి తోటలో పనికి వెళ్ళారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు వారిపై పిడుగు పడింది. దీంతో.. పిడుగుపాటుకు గురై సున్నం అనూష (23), కట్టం నాగశ్రీ (19) ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.