Underground Mine: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని కొండాపురం మైన్ లోకి బుంగపడి లక్షల గ్యాలన్ల నీరు చేరుకుంది. దీంతో మైన్ ని మూసివేసి నీటిని తోడే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. పలు ప్రాంతాలనుంచి సింగరేణి రెస్క్యూ టీం లను రప్పించారు. ఈనెల ఆరవ తేదీ రాత్రి ఒక్కసారిగా బొగ్గు తవ్వకాలు చేపడు తుండగా 1.8 కిలోమీటర్ల లోపల ఉన్న బొగ్గు బ్లాక్ లో బుంగ పడింది . భారీ శబ్దాలతో నీరు ఉబికి రావడంతో ఆందోళనకు గురైన కార్మికులు మైన్ ఇన్చార్జిలు హుటాహుటిన మిషన్ లని పైకి తీసుకుని వచ్చి ప్రాణాలను రక్షించు కున్నారు.
Sadhguru: బిజినెస్‌మేన్‌ను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు
అయితే ఈ నెల నాలుగో తేదీన ములుగు ఏరియాలో భూప్రకంపనలు ఏర్పడగా దాని ప్రభావం వల్లనే ఇక్కడ కూడా బుంగ పడి ..ఉండవచ్చని అంచనా వేస్తున్నారు కానీ సింగరేణి అధికారులు మాత్రం దీనిని నిరాకరిస్తున్నారు. కాగా ఆరవ తేదీ రాత్రి 42వ బ్లాక్ వద్ద బుంగపడి వరదరాగా అది ప్రస్తుతం 36వ బ్లాకు వద్ద వరకు చేరుకుంది నీరు పైకి భారీగా చేరుతుంది. దీంతో బొగ్గు ఉత్పత్తి బొగ్గు వెలికితీత నిలిపివేసి నీటిని పైకి తోడే కార్యక్రమాన్ని చేపట్టారు .అయితే ఎంతకీ నీరు మాత్రం తగ్గటం లేదు. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగా వచ్చని అంచనా వేస్తున్నారు.
CM Chandrababu on Tourism: టూరిజంపై ఫోకస్.. మాటలు కాదు.. 3 నెలల్లో అమలు కనిపించాలి