సినీ నటి మంచు లక్ష్మి నేడు (మంగళవారం) ఉదయం హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. లక్డీకపూల్‌లోని ఆఫీసులో అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఈ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ యాప్‌ల ప్రచారం కోసం ఆమె ఎంత పారితోషికం తీసుకున్నారు? కమీషన్ల రూపంలో ఎంత వెనకేశారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ కేసు ఈనాటిది కాదు. గతంలో ఇదే వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్…
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న నేపథ్యంలో, హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సొసైటీ నిర్ణయించింది. ఈ ముగ్గురు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారని, అయితే వారిని వదిలేసి యూట్యూబర్లను మాత్రమే టార్గెట్ చేయడం సబబు కాదని సొసైటీ ఆరోపిస్తోంది. గత…