Dil Raju: పైరసీ రాయుళ్ల విషయమై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా వేదికగా పలు అంశాలు పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పైరసీ, బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై సినీ పరిశ్రమ నిరంతరం పోరాటం చేస్తోందని, ఈ పోరాటంలో హైదరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇందుకు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. పైరసీ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
Antarvedi Beach: 500 మీటర్లు లోపలికి వెళ్లిన అంతర్వేది బీచ్.. సునామీకి సంకేతమా?
సినిమా పరిశ్రమ నుండి ప్రభుత్వం జీఎస్టీ రూపంలో 18 శాతం ఆదాయాన్ని పొందుతుందని, అయితే పైరసీ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా దెబ్బతింటుందని దిల్ రాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకు పైరసీని అరికట్టడం చాలా ముఖ్యమని అన్నారు.
KTR: రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉంది సీఎం తీరు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రాథమిక విచారణలో పైరసీకి, బెట్టింగ్ యాప్‌లకు సంబంధం ఉన్నట్లు తేలిందని.. అందుకే సినిమా పరిశ్రమ నుండి ఇకపై ఎవరూ కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయరని దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా పరిశ్రమకు, ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.