బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసులన్నిటిని ఇక నుండి సీఐడీ విచారించనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు చేసారు. సైబరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు అయ్యాయి. అగ్ర హీరోల నుంచి యూట్యూబర్స్ వరకు…
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 11 మంది పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. నేడు విష్ణుప్రియ, రీతూ చౌదరి మరోసారి పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు . బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, ఆర్ధిక లావాదేవీలపై విష్ణు ప్రియ, రీతూ చౌదరీలను నేడు మరోసారి ప్రశ్నించనున్న పోలీసులు. ఇటీవల టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, యాంకర్ శ్యామల, విష్ణు ప్రియ,…
Anchor Shyamala: ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల.. రెండున్నర గంటలకు పైగా శ్యామలను పోలీసులు విచారణ చేశారు. ఇక, విచారణ అనంతరం శ్యామల మాట్లాడుతూ.. విచారణ సమయంలో మాట్లాడటం సమంజసం కాదు అని పేర్కొన్నారు. పోలీసుల విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాను.. బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారిని ఎవరు భర్తీ చేయలేరు.. బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్‌లకు పాల్పడటం తప్పు అని ఆమె తెలిపారు. Read Also: Local Body…
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. అతడితో పాటు మరో 11 మంది బుల్లితెర నటులపై కూడా కేసులు నమోదు చేసి నోటీసులు అందించారు పోలీసులు. అయితే బుల్లి తెర యాంకర్ విష్ణు ప్రియ మంగళవారం విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు పోలీసులు. Also Read : Tollywood…
బెట్టింగ్ యాప్ ల కోసం ప్రచారం చేసిన సినిమా సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్ల పైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా 25 మంది సెలబ్రిటీల పైన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇందులో హీరో రానా దగ్గుపాటి ,ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి ,నటి శ్యామల తో పాటు పలువురు యూట్యూబర్ల పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే పంజాగుట్ట…