పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 11 మంది పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. నేడు విష్ణుప్రియ, రీతూ చౌదరి మరోసారి పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు . బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, ఆర్ధిక లావాదేవీలపై విష్ణు ప్రియ, రీతూ చౌదరీలను నేడు మరోసారి ప్రశ్నించనున్న పోలీసులు. ఇటీవల టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, యాంకర్ శ్యామల, విష్ణు ప్రియ, రీతూ చౌదరి లను విచారించిన పోలీసులు. ఈ రోజు మరోసారి విష్ణుప్రియ, రీతూ చౌదరి లను విచారించనున్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నహర్ష సాయి, ఇమ్రాన్ పోలీసులకు అందుబాటులోకి రాలేదు.
Also Read : Raja Saab : రాజాసాబ్ షూట్ ఇంకా పెండింగ్.. రిలీజ్ డౌటే
తనపై కేసు నమోదు అవగానే say no to betting apps. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాను. అవన్నీ గతేడాది చేసినవి, బెట్టింగ్ యాప్స్ ను నమ్మకండి అంటూ వీడియో రిలీజ్ చేసింది రీతు చౌదరి. అలాగే కొద్దీ రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ విచారణకు హాజరైంది. రెండు గంటల పాటు విష్ణు ప్రియను విచారించిన పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసి, సెల్ ఫోన్ ను సీజ్ చేసారు, నేడు మరోసారి విష్ణు ప్రియ, రీతూ చౌదరిలు పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. నేడు రీతూ, విష్ణు ప్రియా విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. పరారీలో ఉన్న హర్ష సాయి, ఇమ్రాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ఎవరు ప్రమోట్ చేసిన ఉపేక్షించేది లేదని అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని పోలీసులు తెలిపారు.