బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. అతడితో పాటు మరో 11 మంది బుల్లితెర నటులపై కూడా కేసులు నమోదు చేసి నోటీసులు అందించారు పోలీసులు. అయితే బుల్లి తెర యాంకర్ విష్ణు ప్రియ మంగళవారం విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు పోలీసులు.
Also Read : Tollywood : టాలీవుడ్ దర్శక నిర్మాతలకు తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరిక..
కానీ సదరు యాంకర్ మంగళవారం విచారణకు హాజరుకాలేదు. ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణించిన పోలీసులు తప్పని సరిగా విచారణకు రావాలని చెప్పడంతో ఈ రోజు విష్ణుప్రియ పోలీసుల ముందు హాజరైంది. రెండు గంటల 40 నిమిషాల పాటు విష్ణు ప్రియను విచారించారు పోలీసులు. విష్ణు ప్రియ స్టేట్మెంట్ ను రికార్డు చేసారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు కొనుగోన్నారు పోలీసులు. Taj777book.com సైట్ లో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ చేసిన విష్ణు ప్రియా. ఆమె ప్రమోట్ చేసిన వీడియోను చూపించి విచారించారు పోలీసులు. మొత్తం 15 బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన విష్ణు ప్రియా, ఇంస్టాగ్రామ్ వేదిక ద్వారా బెట్టింగ్ ప్రమోషన్ చేసిందని అందుకు గాను భారీ మొత్తంలోనే పారితోషకం అందుకున్నటు కనుగొన్నారు. ఇప్పటికే విష్ణు ప్రియా బ్యాంకు స్టేట్ మెంట్ తీసుకున్న పోలీసులు విష్ణు ప్రియ సెల్ ఫోన్ ను సీజ్ చేసారు. అయితే యాప్ కు ప్రమోషనల్ విడియో చేసినట్టు ఒప్పుకుంది విష్ణు ప్రియా. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం నేరమని తెలియదా? బెట్టింగ్ యాప్ ల మూలంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని తెలుసా? ప్రమోట్ చేయడం ద్వారా మీకు ఎంత వరకు లబ్ది చేకూరిందని పోలీసులు ఆరా తీయగా అందుకు విష్ణు ప్రియా మౌనంగా ఉన్నట్టు సమాచారం.