బెట్టింగ్ యాప్ ల కోసం ప్రచారం చేసిన సినిమా సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్ల పైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా 25 మంది సెలబ్రిటీల పైన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇందులో హీరో రానా దగ్గుపాటి ,ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, హీరోయిన్ ప్రణీత, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి ,నటి శ్యామల తో పాటు పలువురు యూట్యూబర్ల పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది సెలబ్రెటీలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కు సెలబ్రిటీలు ప్రచారం చేయడంతో దానికి ఆకర్షితులై యువత అందులో పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. దీనికి తోడు చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కూరుకుపోయారు.
Also Read : Court : చిన్న సినిమా భారీ లాభాలు..
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పైన నిషేధం కొనసాగుతుంది. నిషేధం ఉన్నప్పటికీ బెట్టింగ్ యాప్స్ కొరకు ప్రమోషన్ చేసి కోట్ల రూపాయలు తీసుకుంటున్న సెలబ్రిటీల పైన కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన పలువురు నటులపై కేసులు నమోదు చేసారు. నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళలతో పాటు ప్రణీత, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నయిని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, సాయి, భయ్యా సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుప్రీత, రీతు చౌదరిల పై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే వీరిలో పలువురిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారిస్తున్నారు. మరి దీనిపై ఆయా నటీనటులు స్పందిస్తారా లేదా చూడాలి.