ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. గగనతలంలోనే క్షిపణులను ఇజ్రాయెల్ పేల్చేసింది. కొన్ని మాత్రం టెల్అవీవ్, జెరూసలేం సమీపంలో పడ్డాయి
Israel-Iran War: ఇజ్రాయిల్-హిజ్బుల్లా-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయిల్ హతమార్చింది. నస్రల్లానే కాకుండా హిజ్బుల్లా ప్రధాన కమాండర్లు అందరిని చంపేసింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. దీంతో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాలు నెలకొన్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా తన మరణానికి ముందు ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు అంగీకరించాడని లెబనాన్ మంత్రి తెలిపారు. లెబనీస్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బౌ హబీబ్ మాట్లాడుతూ.. వైమానిక దాడిలో మరణించడానికి కొద్ది రోజుల ముందు నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించారని వెల్లడించారు.
ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. తగిన గుణపాఠం చెబుతామని ఇజ్రాయెల్ చెబుతూనే వచ్చింది.
ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. అయితే కొన్నింటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయి. అయితే మంగళవారం దాడి సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు భయంతో బంకర్లోకి పరిగెడుతున్నారంటూ ఇరాన్ అనుకూల సోషల్ మీడియాలో వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ లో సంభాషించారు. పశ్చిమాసియాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై సుధీర్ఘంగా చర్చించారు.
Mehbooba Mufti: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అడాల్ఫ్ హిట్లర్ తర్వాత నెతన్యాహునే అతి పెద్ద ఉగ్రవాది అని అభివర్ణించింది.
నెతన్యాహూ తన కుడి చేతిలో ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలతో కూడా మిడిల్ ఈస్ట్ దేశాల ఫోటోలను నలుగుపు రంగులో ఉన్నాయి. అదే విధంగా ఎడమ చేతిలో ఈజిప్ట్, సుడాన్, సౌదీ అరేబియాతో పాటు ఇండియా మ్యాప్ కూడా ఉండటం సంచలనంగా మారింది. ఈ దేశాలు గ్రీన్ కలర్లో ఉన్నాయి. యూఎన్జీఏ వేదికగానే ఇరాన్‌కి నెతన్యాహూ వార్నింగ్ ఇచ్చారు. తమని రెచ్చగొడితే ఇరాన్‌లోని ఏ ప్రాంతంలోకైనా చేరుకోగలమని హెచ్చరించారు. ఇరాన్‌పై ఆంక్షలు విధించాల్సిన అవసరాన్ని చెప్పారు
పశ్చిమాసియాలో ఉద్రిక్తల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ.. తమ లక్ష్యాలు పూర్తయ్యే వరకు హమాస్, హిజ్బుల్లా మీద పోరాటం ఆగదని అంతర్జాతీయ వేదికగా నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ సగం బలగాలను అంతం చేశామని.. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు.
Israel-Hezbollah: ఇజ్రాయెల్- హెజ్బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను నిన్న (గురువారం) ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు.